నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏళ్ల తరబడి పోరాడి ఎందరో తమ ప్రాణాలను బలిదానం చేసి తెలంగాణను సాధించుకుంటే.. సీఎం కేసీఆర్ తన పాలనతో దక్షిణ తెలంగాణను ఎడారి మయం చేయనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు
ఆంధ్రప్రదేశ్ చేపట్టిన సంఘమేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్ట్. శ్రీశైలం గర్భం నుంచి సంఘమేశ్వరం వద్ద లిఫ్ట్ చేసి పోతిరెడ్డి పాడు మెయిన్ కెనాల్ ద్వారా నీటిని తీసుకెళ్లే ప్రాజెక్ట్ టెండర్ మెఘా జాయింట్ వెంచర్ కే దక్కింది. ప్రెస్ మీట్లలో మెఘా, ఎస్పీఎంఎల్, ఎన్ సీసీ ఈ మూడు కంపెనీలు జాయింట్ వెంచర్ వేశాయి. ఈ మూడు కంపెనీలు వేసిన జాయింట్ వెంచర్ మెఘా ఇంజనీరింగ్ వర్స్క్ కే దక్కింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అత్యధికంగా పనులు చేస్తుంది ఈ మెఘా కంపెనీ. ఈ మెఘా కంపెనీ సంఘమేశ్వరం టెంపుల్ దగ్గర కట్టే లిఫ్ట్ ద్వారా దక్షిణ తెలంగాణకు చెందిన నాలుగు జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయని ఇప్పటికే యావత్ దక్షణి తెలంగాణకు చెందిన రైతులు, ప్రతిపక్షాలు, తెలంగాణ మీడియా వీ6 వెలుగు గొంతెత్తి చాటింది.
కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తూ వచ్చింది. సంఘమేశ్వరం ప్రాజెక్ట్ ను ఆపే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అని కంటితుడుపు చర్యగా చెప్పింది. అంతేకాదు ఆగస్ట్ 5న ఈ సంఘమేశ్వర ప్రాజెక్ట్ పై జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ కమిటీ మీటింగ్ కు కూడా సీఎం కేసీఆర్ తనుకు ముందే ఫిక్స్ చేసిన పనులున్నాయంటూ ఆగస్ట్ 20 తరువాత వాయిదా వేయించారు. ఈలోగా ఏపీ టెండర్ ఫిక్స్ చేస్తుందని ప్రతిపక్షాలు, వీ6 సైతం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకుండా పోయింది. చివరకు సంఘమేశ్వరం టెండర్ ను మెఘా కే దక్కింది.
