ఈసీ నాగిరెడ్డి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారు

ఈసీ నాగిరెడ్డి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారు

ఈసీ నాగిరెడ్డి కేసీఆర్ కు అమ్ముడుపోయారు
హరీష్ సారు.. నీళ్ల ప్రాబ్లమ్ సాల్వ్ చేయు.. పిల్లలను తర్వాత లెక్కలు అడుగుదువు
రాహుల్ గాంధీకి కేటీఆర్ కు పోలీకా..?
ఎర్రబెల్లి కేటీఆర్ కు చెంచాగిరి చేయకు : జగ్గారెడ్డి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఐఏఎస్ అధికారులు అధికారపార్టీకి ఊడిగం చేయడం మానుకోవాలన్నారు. మీడియాతో మాట్లడిన ఆయన… ప్రతీ ఎన్నికలకు పోలీసులను, నగదును భారీగా సీఎం కేసీఆర్ వాడుతున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు ఇంత దారుణంగా అధికార దుర్వినియోగానికి ఎప్పుడూ పాల్పడలేదని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేసులు పెట్టి వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఖరారుకు నోటీఫికేషన్ కు కనీసం వారం పది రోజులు వ్యవధి ఉండాలని అన్నారు జగ్గారెడ్డి.  రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ లో ఎంత అభివృద్ధి చేశారో టీఆర్ఎస్ సర్కార్ చెప్పగలదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల అధికారులను, పోలీసులను, ఎక్సైజ్ అధికారులను అడ్డుపెట్టుకొని ధనంతో అన్ని మున్సిపాలిటీలను గెలుచుకోవాలని చూస్తుందని చెప్పారు. సంగారెడ్డికి మంచి నీటి ఇబ్బందులకు మంత్రి హరీష్ రావు కారణమని అన్నారు. సంగారెడ్డి ప్రజల మంచినీటి కష్టాల గురించి మాట్లాడని హరీష్ .. మా ఊర్లలోని స్కూల్స్ లో పిల్లలను లెక్కలు అడుగుతున్నడని ఎద్దేవాచేశారు. సర్కార్ బడుల్లో పిల్లల చదువులు అద్వాన్నంగా ఉన్నాయని చెప్పే పనిలో హరీష్ రావు ఉన్నాడని అన్నారు. ప్రైవేటు స్కూల్స్ ల తరుపున హరీష్ పని చేస్తున్నాడని అన్నారు.

 

రాహుల్ గాంధీ పై మంత్రి దయాకర్ రావు విమర్శలు చేయడం సరికాదని అన్నారు జగ్గారెడ్డి. ఎర్రబెల్లికి శక్తివున్నంత కేటీఆర్ ను పొగుడుకోవాలని .. భజన చేసుకోవడంలో.. తప్పులేదు… కానీ కేటీఆర్ దగ్గర చెంచాగిరి చెయ్యకూడదని.. టీడీపీలో ఉండగా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టని తిట్లు తిట్టిన చరిత్ర ఎర్రబెల్లి దయాకర్ రావుదని అన్నారు జగ్గారెడ్డి. మంత్రి పదవి శాశ్వితం కాదనేది దయాకర్ రావు గుర్తించుకోవాలని చెప్పారు. రాహుల్ స్థాయి ఎక్కడ కేటీఆర్ ఎక్కడ .. ఎర్రబెల్లి కేటీఆర్ ను రాహుల్ తో పోల్చడం సరికాదని .. ప్రధాని పదవిని వద్దని త్యాగం చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ అని.. ఆయనతో కేటీఆర్ ను ఎలా పోల్చుతారని అన్నారు.. టీఆర్ఎస్ మంత్రులు రాహుల్ గాంధీ గురించి చిల్లర విమర్శలు చేయవద్దని.. మానుకోక పోతే తాము కూడా అదే అతరహలో ప్రతి విమర్శలు చేస్తామని అన్నారు.