
క్లీవ్‌లాండ్: ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్లీవ్‌లాండ్ చాంపియన్‌షిప్స్ విమెన్స్ డబుల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన క్రిస్టినా మికేల్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా ఆదివారం రాత్రి జరిగిన ప్రి క్వార్టర్స్‌లో 6–3, 6–2తో ఒక్సానా కలష్నికోవా (జార్జియా)–ఆండ్రియా మిటు (రొమేనియా) జంటను వరుస సెట్లలో ఓడించింది. మ్యాచ్ స్టార్టింగ్ నుంచే అదరగొట్టిన సానియా–క్రిస్టినా జోడీ.. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తొలి సెట్ నెగ్గింది. రెండో సెట్‌లోనూ అదే ఊపు కొనసాగించిన ఇండో–అమెరికన్ ద్వయం మ్యాచ్ నెగ్గి క్వార్టర్స్ చేరింది.