టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా మీర్జా

టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా మీర్జా

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. దుబాయ్ ఓపెన్ తర్వాత ఆటకు గుడ్ బై చెప్పనున్నట్లు వెల్లడించింది. తన కొడుకుతో ఎక్కువ సమయం గడపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.  

30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఆరేళ్ల బాలిక తొలిసారిగా టెన్నిస్ కోర్టులో అడుగు పెట్టిందని, తన తల్లితో కలిసి వెళ్లిన సానియాకు టెన్నిస్ ఎలా ఆడాలో కోచ్ వివరించారని ఆ పోస్ట్లో సానియా రాసుకొచ్చింది. ‘‘ నా కలల పోరాటం 6ఏళ్ల వయస్సులో ప్రారంభమైంది. అన్ని సమయాల్లో నా  తల్లిదండ్రులు, కుటుంబం, కోచ్‌, ఫిజియో మద్దతు లేకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ప్రతి ఒక్కరితో సంతోషం, బాధ పంచుకున్నా.  అందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా’’ అని చెప్పింది. 

మ‌హిళ‌ల టెన్నిస్‌కు సానియా మీర్జా  ఓ దిక్సూచిగా నిలిచింది. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లను అధిగమించింది. డబుల్స్‌లో ప్రపంచ నెం.1 ర్యాంకును సైతం సాధించింది. దాదాపు 91 వారాల పాటు డబుల్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగింది. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ఆఫ్రో-ఆసియా క్రీడల్లో ఆమె 14 పతకాలను సాధించింది. 2013 నుంచే సింగిల్స్ ఆడటం మానేసిన ..తన కెరీర్ లో   గ్రాండ్‌స్లామ్ సింగిల్  టైటిల్‌ను గెలవలేకపోయింది.