భారత వైమానిక దళంలో తొలి ముస్లిం మహిళ ఫైటర్ పైలట్

భారత వైమానిక దళంలో తొలి ముస్లిం మహిళ ఫైటర్ పైలట్

మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లోనే కాదు.. దేశ భద్రతలోనూ సత్తా చాటుతున్నారు. గగన విహారం చేయడమే కాదు, యుద్ధ విమానాలు నడపగలం అంటున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్, మీర్జాపూర్ లోని జసోవర్ కి చెందిన సానియా మీర్జా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలెట్ గా ఎంపికైంది. ఈమె దేశంలోనే తొలి ముస్లిం ఫైటర్ పైలెట్ కావడం విశేషం. 

సానియా తండ్రి టీవీ మెకానిక్. చిన్నప్పటి నుంచి ఆమె దేశానికి సేవలందించాలని కలలు కనేది.​అవనీ చతుర్వేది లాంటి మహిళా ఫైటర్​ పైలట్లను ఆదర్శంగా తీసుకొని డిఫెన్స్ అకాడమీలో చేరింది. అందులో భాగంగానే ఎన్ డీఏ పరీక్షలకు హాజరై 149వ ర్యాంక్ సాధించింది. దేశంలోని తొలి మహిళా ఫైటర్ పైలటే కాక ఉత్తరం ప్రదేశ్ తొలి మహిళ పైలట్ గా చరిత్రకెక్కింది. ఈ నెల 27న పుణెలోని ఎన్డీయే ఖడక్వాస్లా అకాడమీలో చేరనుంది.