రెబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదు.. ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ కాను: సానియా మీర్జా

రెబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదు.. ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ కాను: సానియా మీర్జా

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెజెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సానియా మీర్జా తన ఆటతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. కోర్టులో ఆమె దూకుడుగా ఆడుతుంది. బయట కూడా అలానే ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. దాంతో, ఆమెపై రెబల్ అనే ముద్ర పడింది. అయితే, తాను రెబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదని సానియా చెబుతోంది. తాను ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ కూడా కాదని, తనకు నచ్చిన దారిలో నడుస్తున్నానని అంటోంది.  సోమవారం మొదలైన డబ్ల్యూటీఏ దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూటీ ఫ్రీ టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆటకు వీడ్కోలు పలకనున్న సానియా.. తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇతరులను పట్టించుకోకుండా తమకు నచ్చిన బాటలో ముందుకెళ్తున్న వారిపై సమాజం.. విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హీరోలు అనే ముద్ర వేయకూడదని అభిప్రాయపడింది.

‘నేనెప్పుడూ ఎలాంటి రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదని భావిస్తున్నా. అయినా ఈ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేదెవరు?  ఇలానే ఉండాలి.. ఇదే సంప్రదాయం.. అని చెప్పడానికి వాళ్లెవరు? నేనైతే ప్రతీ వ్యక్తి భిన్నంగా ఉంటాడని చెబుతా. ప్రతి వ్యక్తికి అలా భిన్నంగా ఉండే స్వేచ్ఛ ఉండాలంటా. అప్పుడే ఒక సొసైటీగా మనం బాగుంటామని భావిస్తున్నా. నా వరకైతే  నేను ఈ సమాజంలోని అనవసర కట్టుబాట్లను, అడ్డుగోడలను బద్దలు కొట్టిన గొప్ప వ్యక్తినని, ఒక ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అనుకోవడం లేదు.  కేవలం నా జీవితాన్ని గడుపుతున్నానంతే. మనం ఒక్కో విషయాన్ని ఒక్కోలా చూస్తాం. అందరికీ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒకసారి మనమంతా  భిన్నమైన వ్యక్తులమని అంగీకరిస్తే అంతా బాగుంటుంది’ అని చెప్పింది. దుబాయ్​ టోర్నీలో మంగళవారం జరిగే విమెన్స్​ డబుల్స్​ తొలి రౌండ్​లో సానియా–మాడిసన్​ కీస్​ (అమెరికా) జోడీ.. కుదెమెతోవా–సమ్సొనోవాతో జంటతో తలపడనుంది. 

నేను నాలానే ఉండాలనుకుంటా..

తాను తనలానే ఉండాలనుకోవడం  తప్పితే ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదని సానియా చెప్పింది. ‘సాధ్యమైనంత వరకు నాకు నచ్చినట్టే ఉండటానికి ఇష్టపడతా. నేను నాకు నిజం కావడానికి ప్రయత్నించాను. ఈ విషయంలో మాత్రం నేను చాలా గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరికి ఇలా నచ్చినట్టు జీవించే స్వేచ్ఛ ఉండాలి. అంతే తప్ప ఇలా ఉంటే రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినట్టే అని ఎవ్వరూ చెప్పకూడదు’ అని చెప్పింది.

అది ముస్లిం కుటుంబాలకే పరిమితం కాదు

విమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథ్లెట్లకు మద్దతు ఇవ్వకపోవడం కేవలం ముస్లిం కుటుంబాలకే పరిమితం కాదని, ఉపఖండం మొత్తం ఇదే సమస్య ఉందని సానియా తెలిపింది. లేదంటే అన్ని వర్గాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు ఆటల్లో రాణించేవారని అభిప్రాయపడింది. ‘నన్ను టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చి  మా పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలాంటి ప్రెజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనుభవించారో  చిన్నప్పుడు నాకు తెలియదు. కానీ, నేను పెరుగుతున్న కొద్దీ రకరకాల మాటలు వినిపించాయి. ఎండలో ఆడి  అమ్మాయి నల్లగా అయితే ఎవరు పెళ్లి చేసుకుంటారని మా చుట్టాలు అనేవారు’ అని సానియా చెప్పుకొచ్చింది.

అమ్మ  అయ్యాక ఆడుతున్నది అందుకే 

పెండ్లి చేసుకొని తల్లి అయిన తర్వాత రీఎంట్రీ ఇవ్వడానికి కారణమేంటో సానియా చెప్పింది. ‘ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఒకరు వరల్డ్​ చాంపియన్ అవ్వొచ్చని, ఇంకా పూర్తి జీవితాన్ని ఆస్వాదించవచ్చని నిరూపించేందుకే తిరిగి కోర్టులోకి వచ్చా' అని తెలిపింది.