
దీవాస్ : మధ్యప్రదేశ్ లో కొంతమంది అల్లరి మూకల గ్యాంగ్ శానిటేషన్ సిబ్బంది పై దాడి చేసింది. దీవాస్ జిల్లా కోయ్లా మొహల్లా మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ సంఘనట చోటుచేసుకుంది. స్థానికంగా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాంలో రోడ్లు క్లీన్ చేస్తున్న సిబ్బంది తో ఆదిల్ అనే వ్యక్తి గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే వారిపై దాడికి గొడ్డలితో దాడి చేశాడు. తమపై ఆదిల్ అతని సోదరుడు అకారణంగా దాడి చేశారని కార్మికులు చెప్పారు. ఈ దాడిలో ఓ కార్మికుడి చేతికి తీవ్ర గాయమైంది. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించారు. కార్మికుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదిల్ ను అరెస్ట్ చేశారు. ఆదిల్ సోదరుడు పరారీలో ఉన్నాడు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్మికులపై దాడి వీడియో కూడా వైరల్ గా మారింది. ఇటీవల కరోనా టెస్ట్ లు చేసేందుకు వెళ్లిన డాక్టర్లపై కూడా మధ్యప్రదేశ్ లో దాడి జరిగింది.