రాజకీయాల్లో చేరితే ఫస్ట్ మీకే చెబుతా : సంజయ్ దత్

రాజకీయాల్లో చేరితే ఫస్ట్ మీకే చెబుతా : సంజయ్ దత్

గత కొద్దిరోజులుగా బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆయన ఆ పార్టీలో చేరుతున్నారు.. ఈ పార్టీలో చేరుతున్నారని వస్తున్న రూమర్స్‌కు సంజయ్ దత్ చెక్ పెట్టారు. ఆయన రాజకీయ ప్రవేశంపై ఎక్స్ వేదికగా స్పందించారు. నేను ఓ రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం లేదు. రాజకీయాల్లోకి రావడం లేదని తన ట్విట్ లో పేర్కొన్నారు. ఒకవేళ నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటే ముందే ప్రకటిస్తానని తెలిపారు. 

గత కొద్దిరోజులుగా బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆయన ఆ పార్టీలో చేరుతున్నారు.. ఈ పార్టీలో చేరుతున్నారని వస్తున్న రూమర్స్‌కు సంజయ్ దత్ చెక్ పెట్టారు. ఆయన రాజకీయ ప్రవేశంపై ఎక్స్ వేదికగా స్పందించారు.

తాను రాయకీయాల్లోకి వస్తున్నట్లు వచ్చే వార్తలను నమ్మకండని ఎక్స్‌లో ప్రకటించారు. కాగా గతంలో కూడా ఆయన పలు పార్టీల్లో చేరుతున్నారని పుకార్లు వచ్చాయి. 2009లో సంజయ్ లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుండి సమాజ్‌వాదీ పార్టీ (SP) అభ్యర్థిగా ఉన్నారు. ఆయుధాల చట్టం కింద అతని శిక్షను సస్పెండ్ చేయడానికి కోర్టు నిరాకరించడంతో పోటీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా నియమితులైనప్పటికీ ఆయన ఆ పార్టీకి  రాజీనామా చేసి సినిమాల్లోకి వెళ్లారు. ప్రస్తుతానికి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.