టీంలో చోటు లేకపోయినా..ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్న సంజూ శాంసన్

టీంలో చోటు లేకపోయినా..ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్న సంజూ శాంసన్

టీమిండియా వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ తన పనితో  అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. తుది జట్టులో చోటు దక్కకపోయినా..మైదానంలో సంజూ చేసిన ఓ పనికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. అయితే ఈ మ్యాచ్ మొదలయ్యాక మధ్యలో అనేక సార్లు వాన వల్ల ఆట ఆగిపోయింది. ఈ సమయంలో మైదానాన్ని కవర్లతో కప్పేందుకు  సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. పిచ్పైకి కవర్లను తీసుకొచ్చే సమయంలో  గాలుల కారణంగా ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన సంజూ శాంసన్ వారికి సహాయం చేశాడు. కవర్లను పట్టుకుని లాగాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియోను వైరల్ అయింది. 

సంజూకు నిరాశ...

న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్న సంజూ శాంసన్..రెండో వన్డేలో మాత్రం ఆడలేదు. అతని స్థానంలో దీపక్ హుడాకు కెప్టెన్ ధావన్ అవకాశం ఇచ్చాడు. ఫస్ట్ వన్డేలో 36 పరుగులు చేసిన సంజూను కాదని..వికెట్ కీపర్గా రిషబ్ పంత్ను టీమ్ మేనేజ్మెంట్ ఎంపిక చేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై స్పందించిన ధావన్ ..ఆరో బౌలర్ కోసమే సంజూను పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.