రజనీకాంత్ను కలిసిన సంజూ శాంసన్ ..ఎందుకంటే..?

రజనీకాంత్ను కలిసిన సంజూ శాంసన్ ..ఎందుకంటే..?

టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మన్  సంజూ శాంసన్ సూపర్ స్టార్ను కలిశాడు. సౌత్ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్తో మీట్ అయ్యాడు. తన అభిమాన నటుడిని కలవడంపై సంజూ శాంసన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా సంజూ శాంసన్ పంచుకున్నాడు. రజనీకాంత్తో దిగిన ఫోటోను ట్విట్టర్లో షేరస్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. 

రజనీసార్కు పెద్ద ఫ్యాన్

ఏడేళ్ల వయసున్నప్పటి నుంచే తాను సూపర్ స్టార్ రజనీకాంత్ సార్కు అభిమానినని సంజూ తెలిపాడు. ఎప్పటికైనా రజనీకాంత్ సార్ను కలుస్తానని.. అప్పుడే తన తల్లిదండ్రులకు చెప్పానన్నాడు. 21 ఏళ్ల తర్వాత  తన కోరిక నెరవేరిందని..స్వయంగా  తలైవా తనను ఇంటికి ఆహ్వానించినట్లు సంజూ శాంసన్ తెలిపాడు. 

మరిన్ని వార్తలు