ఇండియా, సౌతాఫ్రికా జట్లు తొలి టీ20 ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి టీ20 మంగళవారం (డిసెంబర్ 9) జరగనుంది. కటక్ వేదికగా బారబత్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ కు ఆతిధ్యమివ్వనుంది. తొలి టీ20 టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ కు ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. శాంసన్ స్థానంలో జితేష్ శర్మకు తుది జట్టులో ఛాన్స్ దక్కనుంది. శాంసన్ తో పోల్చుకుంటే జితేష్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడని భారత యాజమాన్యం భావిస్తున్నట్టు సమాచారం. దీంతో తొలి టీ20లో శాంసన్ కు నిరాశ తప్పకపోవచ్చు.
తొలి టీ20కి ముందు శాంసన్ ఓపెనర్ కాదని సూర్య చెప్పిన సంగతి తెలిసిందే. గిల్, అభిషేక్ భారత ఇన్నింగ్స్ ను ఆరంభిస్తారని సూర్య కన్ఫర్మ్ చేశాడు. సూర్య మాటలతో శాంసన్ మిడిల్ ఆర్డర్ లో ఆడతారని భావించారంతా. అయితే మిడిల్ ఆర్డర్ లో జితేష్ ను భారత యాజమాన్యం నమ్మకముంచినట్టు వార్తలు వస్తున్నాయి. చివరిసారిగా ఇండియా ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడినప్పుడు శాంసన్ రెండో టీ20లో నాలుగు బంతుల్లో రెండే పరుగులు చేసి విఫలమయ్యాడు. టాపార్డర్ లో అవకాశం ఇచ్చినా వచ్చిన ఛాన్స్ ను వృధా చేశాడు. మరోవైపు జితేష్.. శాంసన్ స్థానంలో జట్టులోకి వచ్చి 13 బంతుల్లోనే 22 పరుగులు చేసి చక్కటి క్యామియో ఆడాడు.
Also read:- ఐపీఎల్ 2026 మినీ వేలం..
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో మెడ గాయానికి గురైన శుభ్‌మన్ గిల్ నెల రోజుల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. గత ఐపీఎల్ నుంచి నాన్ స్టాప్‌గా క్రికెట్ ఆడుతుండటంతో అతని వర్క్‌లోడ్‌ను కూడా నిశితంగా గమనించనున్నారు. అయితే వరల్డ్ కప్‌కు ముందు గిల్‌కు ఇది మంచి ప్రిపరేషన్ టోర్నీగా మారనుంది. గత 33 మ్యాచ్‌ల్లో 837 రన్స్చేసిన అతను ఈ సిరీస్‌లో ఫామ్‌లోకి వస్తే వరల్డ్ కప్‌లో ఇండియాకు తిరుగుండదు. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు.
ఆసీస్ టూర్‌లో దుమ్మురేపిన అభిషేక్ కూడా మంచి ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ 304 రన్స్ చేశాడు. ఆసియా కప్‌లో కాలిపిక్క గాయానికి గురైన హార్దిక్ పాండ్యా కూడా ముస్తాక్ అలీలో సత్తా చాటాడు. పాండ్యా రాకతో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సమతుల్యత వచ్చింది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్‌పైనే కొద్దిగా సందిగ్ధత నెలకొంది. టీ20 కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత 15 ఇన్నింగ్స్‌ల్లో 184 రన్స్ మాత్రమే చేశాడు. గత 20 మ్యాచ్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. వికెట్ కీపర్‌గా శాంసన్, జితేశ్ మధ్య పోటీ నెలకొంది. బౌలింగ్‌లో ఇండియాకు పెద్దగా ఇబ్బందుల్లేవు.

