శంకర నేత్రాలయ ఫౌండర్ బద్రీనాథ్ కన్నుమూత

శంకర  నేత్రాలయ ఫౌండర్ బద్రీనాథ్  కన్నుమూత

శంకర  నేత్రాలయ ఫౌండర్, ప్రముఖ విట్రియోరెటినల్ సర్జన్ ఎస్. ఎస్ బద్రీనాథ్  కన్నుమూశారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 2023 నవంబర్ 21వ తేదీ తెల్లవారుజామున  తుదిశ్వాస విడిచారు.  83 ఏళ్ల బద్రీనాథ్  దేశంలోనే అత్యుతమ కంటి వైద్యులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆయన 1978 చెన్నైలో ఛారిటబుల్  కంటి ఆసుపత్రిని బద్రీనాథ్  స్థాపించారు.  శంకర  నేత్రాలయ దేశంలోనే అతిపెద్ద ఛారిటబుల్  ట్రస్టుల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది.  

బద్రీనాథ్ అసలు పేరు  సెంగమేడు శ్రీనివాస బద్రీనాథ్ 1940  ఫిబ్రవరి 24న జన్మించారు.  బద్రీనాథ్ 1996లో భారతదేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ పురస్కారంను అందుకున్నారు.  అంతేకాకుండా డాక్టర్ బిసి రాయ్ అవార్డుతో సహా అనేక ఇతర అవార్డులను అందుకున్నాడు. బద్రీనాథ్  అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి.  బద్రీనాథ్  సతీమణి వాసంతి పీడియాట్రిషియన్ , హెమటాలజిస్ట్.