సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ దంపతులు

సంక్రాంతి  వేడుకల్లో సీఎం జగన్ దంపతులు

ఏపీ అమరావతి తాడేపల్లిలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. క్యాంప్ ఆఫీస్ లో జరిగిన వేడుకుల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ పంచెకట్టులో సంబురాలకు అటెండయ్యారు జగన్. గోశాలలోని ఆవులకు ప్రత్యేక పూజలు చేశారు. గంగిరెద్దుల ఆటలు చూశారు. కోలాటాలు ఆడిన చిన్నారులు, మహిళలను అభినందించారు. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెప్పిన జగన్.... ప్రతీ ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వేడుకల్లో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

బెంగాల్లో గంగాసాగర్ మేళా ప్రారంభం