అరకులో సంక్రాంతికి వస్తున్నాం చివరి షెడ్యూల్

అరకులో సంక్రాంతికి వస్తున్నాం చివరి షెడ్యూల్

వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.  ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శుక్రవారం ఫైనల్ షెడ్యూల్ అరకులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన  వీడియోలో స్కూల్ స్టూడెంట్స్ వెంకటేష్‌‌కి  గ్రాండ్ వెల్‌‌కమ్ చెప్పడం ఆకట్టుకుంది.

దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌‌గా నటిస్తున్నారు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.