సంత్ సేవాలాల్ జన్మదినాన్ని బంజారా దినోత్సవంగా డిక్లేర్ చేయాలి : ధర్మపురి అర్వింద్

సంత్ సేవాలాల్ జన్మదినాన్ని బంజారా దినోత్సవంగా డిక్లేర్ చేయాలి  : ధర్మపురి అర్వింద్

న్యూఢిల్లీ, వెలుగు :  బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జన్మదినం ఫిబ్రవరి 15ను బంజారా దినోత్సవంగా ప్రకటించి, జాతీయ సెలవు దినంగా డిక్లేర్ చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం లోక్ సభ జీరో అవర్ లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సేవాలాల్‌‌ ని స్మరిస్తూ 2023లో అనేక ప్రోగాంలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ విధంగా చేయడం సంత్ సేవాలాల్ వంటి ఆధ్యాత్మిక నాయకుల ప్రయత్నాలకు నివాళిగా దోహదపడుతుందన్నారు. ఈ సందర్బంగా తెలంగాణకు సమ్మక్క,-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డును మంజూరు చేసినందుకు ప్రధానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ట్రైబల్స్ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నారని చెప్పారు.