విక్రాంత్, చాందిని చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. నవంబర్ 14న సినిమా విడుదల కానుంది. గురువారం (నవంబర్ 06) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. నిర్మాత దిల్ రాజు, హీరో ఆనంద్ దేవరకొండ అతిథులుగా హాజరై ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉందని, సినిమా సక్సెస్ సాధించాలని కోరారు.
విక్రాంత్ మాట్లాడుతూ ‘స్క్రిప్ట్ విన్నాక ఇందులో మేల్ ఫెర్టిలిటీ అనే కొత్త విషయం ఉంది. -ఈ చిత్రంలో చైతన్య అనే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ క్యారెక్టర్‌లో నటించాను. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్‌తోపాటు మంచి మెసేజ్ కూడా ఉంది’ అని చెప్పాడు. చాందిని చౌదరి మాట్లాడుతూ ‘మన సొసైటీలో ఫెర్టిలిటీ ఇష్యూ చాలా ఉంది. విషయాలను ఎక్కడా హద్దు దాటకుండా సెన్సిబుల్‌గా రూపొందించారు. ఇందులో కల్యాణి ఓరుగంటి అనే పాత్రలో కనిపిస్తా’ అని చెప్పింది.
ప్యూర్ లవ్‌స్టోరీకి సోషల్ ఇష్యూను జోడించి ఈ చిత్రాన్ని తీశామని డైరెక్టర్ సంజీవ్ రెడ్డి అన్నాడు. మంచి కాన్సెప్ట్ ఉన్న క్యూట్ మూవీ ఇదని నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, హరి ప్రసాద్ రెడ్డి అన్నారు. డైలాగ్ రైటర్ కల్యాణ్ రాఘవ్, స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్.జి, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ పాల్గొన్నారు.
