
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’.శుక్రవారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఇంటీరియర్ డిజైనింగ్ చేసి సరైన ఉద్యోగం లేక చెన్నైలో బైక్ పూలింగ్ చేస్తూ ఇబ్బందులు పడే యువకుడిగా సంతోష్ శోభన్ కనిపించాడు.
ఓరోజు తన బైక్‌పై జర్నీ చేస్తూ అతన్ని కలుస్తుంది మానస. అపరిచితులుగా పరిచయమైన వాళ్ల మధ్య ప్రేమ చిగురించినట్టుగా టీజర్‌లో చూపించారు. ‘స్పార్క్స్ ఇన్ యువర్ ఐస్, దే షైన్..’అంటూ ఆదిత్య రవీంద్రన్ కంపోజ్ చేసిన బిట్ సాంగ్ ఆకట్టుకుంది.
‘‘ఒకప్పటి సాధారణ క్షణాలన్నీ జ్ఞాపకాలుగా మారడమే జీవితం..”అని టీజర్ చివర్లో చూపించిన క్యాప్షన్ ఆకట్టుకుంది. టీజర్లో రొమాన్స్, కిస్ సీన్ యూత్కి బాగా కనెక్ట్ అవుతాయి. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
మానస వారణాసి:
మానస వారణాసి, తెలంగాణకు చెందిన మోడల్. అందాల పోటీ విజేత. ఫెమినా మిస్ ఇండియా 2020 అందాల కిరీటాన్ని అందుకుంది. మానస వారణాసి 1997, మార్చి 27న హైదరాబాదులో జన్మించింది. తండ్రి ఉద్యోగం కారణంగా మలేషియాకు వెళ్ళిన మానస 2011-12 బ్యాచ్‌లో GIIS మలేషియా క్యాంపస్ నుండి గ్రేడ్ 10 పూర్తి చేసింది.
ఆ తర్వాత హైదరాబాదుకి వచ్చి ఎఫ్ఐఐటి జెఈఈలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. 2019లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ పోటీలో పాల్గొన్న మానస.. టాప్ 3 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. 2020లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్ కోసం ఆడిషన్ చేసి, అందులో విజేతగా నిలిచింది.
2021, ఫిబ్రవరి 10న మిస్ వరల్డ్ ఛాంపియన్ గా 10వ స్థానంలో నిలిచింది. ఇకపోతే మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన దేవకీ నందన వాసుదేవ మూవీలో మానస నటించింది. సత్య పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.