
కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగులో విడుదల చేసింది. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కు తోం ది. సైడ్ ఎ గా విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. హేమంత్ ఎం.రావు దర్శక త్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరో రక్షిత్ శెట్టి, హీరోయిన్ రుక్మిణీ వసంత్ కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టు కుంది. నవంబర్ 17న సైడ్ బి (సెకెండ్ పార్ట్) రిలీజ్ అవు తోంది. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను శనివారం సమంత విడుదల చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పింది. ‘సైడ్ ఎ’ సక్సెస్ సాధించినట్లు గానే, ‘సైడ్ బి’ కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల అన్నారు.