
మొన్నమొన్నటి వరకు ‘సర్కారువారి పాట’ సినిమా అప్‌డేట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు ఫ్యాన్స్. ఇప్పుడు వరుస అప్‌డేట్స్‌తో వాళ్లలో హుషారు నింపుతున్నారు మేకర్స్. రీసెంట్‌గా మహేష్ లుక్‌ని రిలీజ్ చేసి, సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు మహేష్ బర్త్ డే సందర్భంగా రోజుకో ట్రీట్ ఇస్తున్నారు. మొన్న టీజర్ టైమ్‌ని అనౌన్స్ చేశారు. నిన్న లుక్‌ని వదిలారు. ‘తను స్మార్ట్. తను సాఫ్ట్. తను స్టైలిష్. తను టఫ్’ అంటూ అభిమానుల్ని ఆనందపర్చారు. మహేష్ సూపర్ కూల్‌గా కనిపిస్తున్న ఈ లుక్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఇక ఈ రోజు తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు టీజర్ రిలీజయింది. మహేష్ నెక్స్ట్ మూవీస్ నుంచి కూడా స్పెషల్ అప్‌డేట్స్ రానున్నాయి. ఇంకేముంది.. అభిమానులకు పండగే!
Here we go!! #SVPBlasterhttps://t.co/YOvkHluTXt@KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus #sarkaruVaariPaata
— Mahesh Babu (@urstrulyMahesh) August 8, 2021