నిధులు స్వాహా చేస్తుండని సర్పంచుపై ఉప సర్పంచ్ ఫిర్యాదు

నిధులు స్వాహా చేస్తుండని సర్పంచుపై ఉప సర్పంచ్ ఫిర్యాదు
  • ఇద్దర్నీ పదవుల నుండి తాత్కాలికంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ 
  • గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ పంచాయతీలో స్థానిక నేతల మధ్య వార్

కరీంనగర్: గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ సర్పంచి లింగంపల్లి జ్యోతి, ఉపసర్పంచి పద్మలను పదవులను నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల్లో సర్పంచి జ్యోతి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఉపసర్పంచి పద్మ, ఆమె భర్త యాదగిరి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఉప సర్పంచు, ఆమె భర్త యాదగిరి తమను వేధిస్తున్నాడని సర్పంచ్ జ్యోతి, ఆమె భర్త బాలరాజు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ చేయించిన జిల్లా కలెక్టర్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి సర్పంచుతోపాటు ఉపసర్పంచుకు కూడా సమాన బాధ్యతలు ఉన్నాయనని భావిస్తూ.. ఇద్దరిపై వేటువేశారు కలెక్టర్. తమకు అందిన ఫిర్యాదులపై సంజాయిషీ సరిగ్గా లేకపోవడంతో ఇద్దరినీ విధుల నుంచి తాత్కాలికంగా తప్పించినట్లు కలెక్టర్ వివరణ ఇచ్చారు.  
ఉపసర్పంచి పద్మ, ఆమె భర్త యాదగిరి కలిసి వేధిస్తున్నారని.. చేసిన పనులకు సంబంధించి చెక్కులపై సంతకాలు చేయడం లేదని చాలా రోజులుగా ఆందోళన చేస్తున్న సర్పంచి లింగంపల్లి జ్యోతి, ఆమె భర్త బాలరాజు  తమను ఉప సర్పంచు, ఆమె భర్త వేధిస్తున్న తీరుపై సర్పంచ్ జ్యోతి భర్త బాలరాజు సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేశారు. అంతేకాదు పలుమార్లు ప్రజావాణిలోనూ ఫిర్యాదులు చేయడం చర్చనీయాంశం అయింది. రచ్చకెక్కిన విభేదాలపై ఎట్టకేలకు విచారించిన జిల్లా కలెక్టర్ ఇద్దరిపైనా వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.