హామీలు నెరవేర్చకపోతే రాజీనామా : పోలుమళ్ల గ్రామం భూత లింగరాజు

హామీలు నెరవేర్చకపోతే రాజీనామా : పోలుమళ్ల గ్రామం భూత లింగరాజు
  •     ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి

సూర్యాపేట, వెలుగు: రెండేళ్లలో హామీలు నెరవేర్చకుంటే తన పదవికి వెంటనే రాజీనామా చేస్తానని ఓ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పరిధిలోని పోలుమళ్ల గ్రామంలో భూత లింగరాజు సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. 

తాను ఎన్నికైతే గ్రామ అభివృద్ధికి ఇచ్చిన హామీలను రెండేళ్లలో నెరవేరుస్తానని లేకపోతే గ్రామ సభ ఏర్పాటు చేసి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రజల సమక్షంలో ప్రకటించారు. తాను కేవలం ఎన్నికల కోసం హామీలు ఇవ్వడం లేదని, గ్రామాభివృద్ధి పట్ల తనకున్న నిజాయితీని నిరూపించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు.