అన్న పోటీకి నిలబడ్డడని సర్పంచ్ అభ్యర్థి సూసైడ్ అటెంప్ట్..సిద్దిపేట జిల్లా ఘనపూర్ గ్రామంలో ఘటన

అన్న పోటీకి నిలబడ్డడని  సర్పంచ్ అభ్యర్థి సూసైడ్  అటెంప్ట్..సిద్దిపేట జిల్లా ఘనపూర్ గ్రామంలో ఘటన

సిద్దిపేట, వెలుగు: తనకు సహకరించకుండా అన్న కూడా పోటీలో నిలపడడంతో ఓ సర్పంచ్​ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. సిద్దిపేట జిల్లా ఘనపూర్ గ్రామం ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో మాజీ ఉప సర్పంచ్ జి.ఎల్లయ్య, అతడి అన్న బాల్ నర్సయ్య, బాబాయ్ కొడుకు సాయిలు బరిలో ఉండాలని డిసైడ్​ అయ్యారు. వీరంతా ఒకే కుటుంబం కావడంతో ముగ్గురు పోటీ పడితే ప్రత్యర్థులకు లాభం జరుగుతుందని భావించారు. 

బాల్ నర్సయ్య పోటీ నుంచి తప్పుకుని మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు నామినేషన్​ వేయండని ఎల్లయ్య, సాయిలుకు సూచించాడు. కానీ వీరిద్దరూ నామినేషన్లు వేశారు. దీంతో ఎల్లయ్య మనస్తాపానికి గురయ్యాడు. సొంత కుటుంబీకులే తనకు సహకరించడం లేదని మంగళవారం పురుగుల మందు తాగాడు. సిద్దిపేట జిల్లా హాస్పిటల్​కు తరలించి ట్రీట్​మెంట్​ఇచ్చారు.