ఈ పంచాయితీల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం.. గ్రామాల్లో సంబరాలు..

ఈ పంచాయితీల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం.. గ్రామాల్లో సంబరాలు..

తెలంగాణలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పల్లెల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. మంగళవారం ( నవంబర్ 25 ) నోటిఫికేషన్ విడుదల కాగా.. మరుసటి రోజే ఏకగ్రీవాల హవా మొదలైంది. వికారాబాద్ జిల్లాలో మంతన్ గౌడ్ గ్రామ సర్పంచ్ ఎన్నిక దాదాపు ఏకగ్రీవమయ్యింది. ఈ గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ రావడం.. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క ఎస్టీ కుటుంబాన్ని అదృష్టం వరించింది. ఈ కుటంబానికి చెందిన ఒక వ్యక్తి సర్పంచ్ గా ఎన్నిక కానుండగా.. వార్డు సభ్యుల స్థానాలు కూడా ఎస్టీ రిజర్వేషన్ కావడంతో అదే కుటుంబం నుంచి వార్డు సభ్యులు ఉండనున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. గ్రామానికి చెందిన కోవ రాజేశ్వర్ ను సర్పంచ్ గా ఎన్నుకున్నారు గ్రామస్థులు. దోబ్బిగూడ, మోహన్ గూడ. ప్రజలందరు కలిసి రాజేశ్వర్ ఎన్నుకున్నారూ అదివాసీలు.ఏకగ్రీవంగా ఎన్నికైన కోవ రాజేశ్వర్ ను అభినందించారు గ్రామస్థులు.

ఇదిలా ఉండగా.. మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు గ్రామాల బాట పట్టారు. రిజర్వేషన్ ఆధారంగా పార్టీ క్యాండిడేట్లను ఫైనల్  చేసే పనిలో ఉన్నారు. మెజార్టీ గ్రామాల్లో ఏకగ్రీవం చేసేందుకు చర్యలు  ప్రారంభించారు. 

కరీంనగర్  పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నకుంటే తన నియోజకవర్గ నిధుల నుంచి ఆ గ్రామాలకు రూ. పది లక్షల చొప్పున నజరానా ఇస్తానని ప్రకటించారు. అదే విధంగా ఖమ్మం నుంచి ప్రాతి నిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తన సెగ్మెంట్ పరిధిలో ఏకగ్రీవంగా సర్పంచును, వార్డు సభ్యులను ఎన్నుకున్న గ్రామాలకు రూ. 10 లక్షల చొప్పున బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించారు.