ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోవాలి..లేదంటే మానసికంగా వేధిస్తరు

ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోవాలి..లేదంటే మానసికంగా వేధిస్తరు

పార్టీ కోసం పని చేసే వాళ్లను వేధిస్తున్నారంటూ హన్మకొండ జిల్లా  జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకుంటున్నారని... అలాంటి వాళ్లే పార్టీకి నష్టం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. నిధులు ఇవ్వకపోవడంతో పార్టీ కోసం పనిచేసే సర్పంచులు ..బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ సర్పంచులు చేస్తున్న అభివృద్ధిని మండల బీఆర్ఎస్ నాయకులు కూడా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సర్పంచ్ అని కూడా చూడకుండా వేధింపులు..చేసిన పనులకు కూడా బిల్లులు ఇవ్వకుండా అడ్డుకుని ఇబ్బందులు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజయ్య అనుచరులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మసాగరం మండలం వాళ్లు చెప్పినట్లు వింటేనే గ్రామాభివృద్ధికి సహకరిస్తారని....లేదంటే మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు  వాళ్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోవాలి అంటూ సంచలన ఆరోపణలు చేశారు..

ఎమ్మెల్యే రాజయ్య రియాక్షన్..

ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి.. గతంలో జరిగినట్లు కుట్రలు జరుగుతున్నాయి.. ప్రజల్లో ఆదరణ చూసి ఓర్వలేక..ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషించి..నన్ను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు.. త్వరలోనే సీఎం కేసీఆర్ ను కలిసి అన్ని వివరాలు వివరిస్తాను.. త్వరలోనే ఎన్నికలు ఉన్నాయని..ఈ సమయంలో ఇలాంటి ఆరోపణలు,విమర్శలు చేయటం చూస్తుంటే.. పార్టీలోనే కొంత మంది కుట్ర చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు...ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దగ్గరే తేల్చుకుంటామన్నారు..