సీఎంను కలిసిన చిన్నమందడి సర్పంచ్

సీఎంను కలిసిన చిన్నమందడి సర్పంచ్

పెద్దమందడి, వెలుగు: మండలంలోని చిన్నమందడి సర్పంచ్ సూర్యచంద్రారెడ్డి ఆదివారం సీఎం రేవంత్​రెడ్డిని ఆయన నివాసంలో కలిసి బొకేను అందజేసి విషెస్​ తెలిపారు. ఆదర్శ గ్రామంగా, ఉత్తమ గ్రామ పంచాయతీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామం అవార్డులు దక్కించుకుందని చెప్పారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను సీఎంకు వివరించారు.

వీడీసీని ఏర్పాటు చేసి రైతుల కోసం సేంద్రియ ఎరువులు తయారీ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేలా పంటసాగుపై శిక్షణ తరగతులు ఇస్తున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.