మిర్యాలగూడలో కూలీగా మారిన సర్పంచ్​

మిర్యాలగూడలో కూలీగా మారిన సర్పంచ్​

మిర్యాలగూడ, వెలుగు: గౌరవ వేతనం రాకపోవడం, బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచ్​కూలీగా మారాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్​ తండా గ్రామ పంచాయతీ జనాభా1060. ఈ పంచాయతీ సర్పంచ్​ధనావత్​రాంచంద్రనాయక్. పంచాయతీలో ఎన్ఆర్ఈజీఎస్, జీపీ ఫండ్స్​కింద పలు పనులు చేపట్టారు. అయితే ఈజీఎస్​ ఫండ్స్​ బిల్లులు రూ. 9.2 లక్షలు ఎనిమిది నెలలుగా పెండింగ్​ పెట్టారు. మరోవైపు సర్పంచులకు ఇచ్చే గౌరవ వేతనం రూ. 6,500 మూడు నెలలుగా ఇవ్వడం లేదు.

దీంతో రాంచంద్రనాయక్​ కూలికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం మిర్యాలగూడకు రైల్వే వ్యాగన్​ రాగా అక్కడ కూలి పనికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై రాంచంద్రనాయక్​ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధుల వద్ద బిల్లుల విషయం మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఎనిమిదేళ్లు గడిచినా జీపీ భవన నిర్మాణం చేపట్టడం లేదని వాపోయాడు.