మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుకున్న సర్పంచులు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుకున్న సర్పంచులు

సంగారెడ్డి పర్యటనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సర్పంచులు అడ్డుకున్నారు. హరితహారంపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అయితే సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు సర్పంచులు. జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి వద్దకు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మంత్రి ఎర్రబెల్లికి వ్యతిరేకంగా సర్పంచులు నినాదాలు చేశారు. దీంతో  సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత సభలో ప్రసంగించిన మంత్రి ఎర్రబెల్లి సర్పంచులపై అసహనం వ్యక్తం చేశారు .