సఫాయి కార్మికులుగా మారిన సర్పంచులు

సఫాయి కార్మికులుగా మారిన సర్పంచులు

రాష్ట్రవ్యాప్తంగా మల్టీ పర్పస్​ వర్కర్లు సమ్మెబాట పట్టడంతో సర్పంచులే సఫాయి కార్మికులుగా మారారు. ట్రాక్టర్లతో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్నారు. తమ ఉద్యోగాలు పర్మినెంట్​ చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలంటూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 43 వేల మంది పంచాయతీ కార్మికులు ఈ నెల 6 నుంచి సమ్మెకు దిగారు. దీంతో చెత్త ఎత్తేవారు, మోరీలు తీసేవారు లేక ఊర్లన్నీ కంపుకొడ్తున్నాయి. వర్షాకాలం కావడంతో ఎక్కడి నీళ్లు అక్కడే ఆగి దుర్వాసన వస్తున్నది. జనం నుంచి కూడా ఒత్తిడి  పెరగడంతో సర్పంచ్​లే రంగంలోకి దిగారు. పంచాయతీ ట్రాక్టర్లను ఇంటింటికీ తిప్పి చెత్త సేకరిస్తున్నారు. మురుగు కాల్వల్లో పూడిక తీసుకుంటున్నారు.