ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం : శ్రీనివాస్ గౌడ్

ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం : శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ వైతాళికులను గొప్పగా గౌరవించుకుంటున్నామని చెప్పారు. ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడి చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వలేదని.. కానీ బీఆర్ఎస్ వచ్చాక ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఆయన పాలించిన కోటలను సంరక్షించే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సర్వాయి పాపన్న చరిత్ర కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో ఉండడం గర్వకారణమన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా అమరజ్యోతి, అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహం, పీవీ నరసింహరావు విగ్రహం, సచివాలయం నిర్మిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కుతుందన్నారు.