నల్గొండను కార్పొరేషన్ చేసిన ఘనత మంత్రి కోమటిరెడ్డిదే : గుమ్మల మోహన్ రెడ్డి

నల్గొండను కార్పొరేషన్ చేసిన ఘనత మంత్రి కోమటిరెడ్డిదే : గుమ్మల మోహన్ రెడ్డి

నల్గొండ, వెలుగు: నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్  గా మార్చడంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా చేస్తూ అసెంబ్లీలో ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్  సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లెక్సీ లకు పాలాభిషేకం చేశారు.  

స్వీట్లు పంచి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు.  రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో నల్లగొండలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ,యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.