రవాణా శాఖ వార్షిక ఆదాయం రూ. 5142 కోట్లు : రవాణా అధికారులు

రవాణా శాఖ వార్షిక ఆదాయం రూ. 5142 కోట్లు : రవాణా అధికారులు
  •     83 శాతం టార్గెట్ సాధించామని అధికారుల వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రవాణా శాఖ రూ.5,142 కోట్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జించింది. ఏప్రిల్ నుంచి డిసెంబర్  వరకు రూ.6,165 కోట్ల వార్షిక ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.5,142 కోట్ల ఆదాయాన్ని పొందింది. 83 శాతం లక్ష్యాన్ని సాధించామని సోమవారం రవాణా అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. 

ఇందులో లైఫ్ టాక్స్  ద్వారా రూ.3,611 కోట్లు, త్రైమాసిక పన్నుల ద్వారా రూ.730 కోట్లు, గ్రీన్ టాక్స్  ద్వారా రూ.57 కోట్లు, వివిధ రకాల ఫీజుల రూపంలో రూ.408 కోట్లు, తనిఖీల ద్వారా రూ.181 కోట్లు, సర్వీస్  చార్జీల ద్వారా రూ.153 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వివరించారు.