యాదాద్రి, వెలుగు: ఆహార భద్రత నిబంధనలను పట్టించుకోకుండా కల్తీ చేస్తే కేసులు నమోదు చేస్తామని అడిషనల్ కలెక్టర్ఏ భాస్కరరావు హెచ్చరించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన డిస్ట్రిక్ లెవల్ఫుడ్సేఫ్టీ అడ్వైజరీ కమిటీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కొన్ని హోటల్స్‌లో ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. కల్తీ నూనె వాడడంతో పాటు నూనె ఎక్కువ కాలం ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తోందన్నారు.
ఆకర్షణీయంగా కన్పించాలన్న ఉద్దేశంతో స్వీట్స్‌లో కలర్స్ ఉపయోగిస్తున్నారన్నారు. కుళ్లిన కూరగాయలు వాడడం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయన్నారు. మీటింగ్‌లో ఎస్పీ అక్షాంశ్‌యాదవ్, ఆర్డీవో కృష్ణారెడ్డి, డీఏవో రమణారెడ్డి, డీఎంహెచ్‌వో మనోహర్, డీఈవో సత్యనారాయణ, సివిల్ సప్లయ్ఆఫీసర్రోజారాణి, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్స్వాతి ఉన్నారు.
