గ్రేట‌ర్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరుతున్న ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌

గ్రేట‌ర్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరుతున్న ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌

హైదరాబాద్: గ్రేటర్ తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హస్తానికి గుడ్‌బై చెప్పనున్నారు. మహేంద్రహిల్స్‌లోని సర్వే సత్యనారాయణ ఇంట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ కలిశారు. ఈ సందర్భంగా బీజేపీలోకి రావాలని సర్వే సత్యనారాయణను ఆహ్వానించారు. దీంతో వారి అభ్యర్థనను సర్వే సత్యనారాయణ స్వాగతించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌.. సర్వేకే పుష్పగుచ్చం ఇచ్చి, శాలువా కప్పి బొకే చేతిలో పెట్టి ఫొటోలకు ఫోజులిచ్చారు