అవసరమైతే మా అల్లుడిపై పోటీ చేస్తా: సర్వే సత్యనారాయణ

 అవసరమైతే  మా అల్లుడిపై పోటీ చేస్తా: సర్వే సత్యనారాయణ

వచ్చే ఎన్నికల్లో  కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానన్నారు  కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ. ఢిల్లీ అధిష్టానం ఆదేశాల మేరకే తాను కంటోన్మెంట్ నుంచి దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు.  తన అల్లుడు క్రిశాంక్ కు బీఆర్ఎస్ కంటోన్మెంట్ టికెట్ ఇవ్వకపోవడం ఆ పార్టీ  ఇష్టమన్నారు. ఒక వేళ ఎన్నికల నాటికి  క్రిశాంక్ కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా.. తాను  కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటానని చెప్పారు. తనపై కాంగ్రెస్ లో ఎలాంటి షోకాజ్ నోటీసులు కానీ, సస్పెన్స్ లు కానీ లేవన్నారు. ఉత్తమ్ ను, కుంతీయ లాంటి వ్యక్తులను పదవుల నుంచి తొలగించినందుకే  తాను మళ్లీ వచ్చానన్నారు. 

1985- 89 సంవత్సరంలో తాను కంటోన్మెంట్ లో పోటీ చేసి ఎమ్మెల్యే గా ప్రజలకు సేవలాందించాని సర్వే సత్యనారాయణ చెప్పారు.  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తిరిగి అవకాశం ఇవ్వడంతో మళ్ళీ కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 

రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనకు రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని  సర్వే సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి రాష్ట్రాన్ని అధికారంతో ఇచ్చేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పారు. తనను చాలా మంది తమ పార్టీల్లోకి రావాలని ఆహ్వానించారు కానీ..తాను కాంగ్రెస్ ను విడిచి వెళ్లబోనని స్పష్టం చేశారు. తనకు జన్మనిచ్చింది తన తల్లి అయితే.. రాజకీయ జన్మనిచ్చింది సోనియాగాంధీ అని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి జరిగిందన్నారు.