
‘పుష్ప’ (Pushpa) మూవీలో కేశవ పాత్రతో ఫేమస్ అయిన జగదీష్ ప్రతాప్ బండారి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’ (Sathi Gani Rendu Ekaralu). అభినవ్ దండ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఆహా ఓటీటీ లో విడుదల కావాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోనే అయ్యింది.
ఇక తాజాగా ఈ చిత్ర రిలీజ్ కోసం కొత్త డేట్ ని ఫిక్స్ చేశారు. మే 26 నుంచి ఈ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుందని ఆహా టీం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ కూడా విడుదల చేసింది. దీనికి ‘‘సత్తి ముందు జెప్పిన రోజు రాలే.. వాని రెండెకరాల భూమి చిక్కుల్ల పడిండే.. ఇగ అన్నీ సెటిల్ అయినయ్. మే 26న ముహూర్తం పెట్టినం. అస్తుండు, ఆగమాగం జేయనీకి’’ అంటూ ఆసక్తికర క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక టీజర్, ట్రైలర్ చూస్తే ఈ మూవీ భూ సమస్యల నేపథ్యంలో రూపొందినట్టు అర్థమవుతోంది.
వెన్నెల కిశోర్, అనీషా, మోహన శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి పుష్ప సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న జగదీష్.. సత్తిగాని రెండెకరాలు మూవీతో ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.