
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సాత్విక్ చదివిన నార్సింగి శ్రీ చైతన్య కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే కార్పొరేట్ కాలేజీల ప్రచారాలపై కమిటీని వేయాలని నిర్ణయించింది . సాత్విక్ ఘటనపై ఇంటర్ బోర్డుకు శ్రీ చైతన్య యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. అలాగే అదనపు టైంలో క్లాసులు నిర్వహిస్తే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. వచ్చే ఎకానమిక్ ఇయర్ నుంచి కాలేజీల్లో బయోమెట్రిక్ అమలు చేస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు.