నిర్మల్, వెలుగు: కోర్టుల బలోపేతంతోనే త్వరితగతిన న్యాయ సేవలు అందుతాయని హైకోర్టు జడ్జి కే లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం హైకోర్టు న్యాయ మూర్తులు సృజన, నందికొండ నర్సింగరావులతో కలిసి నిర్మల్ లో నూతనంగా నిర్మించనున్న జిల్లా కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో కోర్టుల అవసరాలు లేని సమాజం ఏర్పడాలని ఆకాంక్షించారు.
అందరికీ న్యా య సేవలు అందించడమే కోర్టుల లక్ష్యమన్నారు. కోర్టుల ఆధునీకరణ, మౌలిక సదు పాయాల కల్పనతో సమాజానికి న్యాయ సేవలు మరింత దగ్గరవుతాయన్నారు. ఒకేచోట 12 కోర్టుల నిర్మాణం జరగబోతుండడం మంచి పరిణామం అన్నారు. కోర్టు భవన సముదాయాల నిర్మాణాలు వెంటనే పూర్తయ్యేట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోక్సో కేసుల తగ్గుదలకు అందరూ చొరవ తీసుకోవాలన్నారు.
పోక్సో కోర్టుల అవసరం లేని పరిస్థితులు నెలకొలాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టులపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆధునిక సౌకర్యాలతో 12 కో ర్టు లను నిర్మిస్తుండడం ద్వారా న్యాయ సేవలు మరింత మెరుగవుతాయన్నారు. న్యాయ వా దులకు, కోర్టు అధికారులు, సిబ్బందికి సైతం ఎంతో సౌకర్యం ఏర్పడుతుందన్నారు.
కా ర్యక్రమంలో హైకోర్టు జడ్జిలు సుజన నందికొండ నర్సింగరావులు ప్రసంగించారు కా ర్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిల, అడిషనల్ ఎస్పీలు సాయి కుమార్, ఉపేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
