హైదరాబాద్​ను రెండో రాజధాని చేయండి : సత్యారెడ్డి

హైదరాబాద్​ను రెండో రాజధాని చేయండి :  సత్యారెడ్డి

బషీర్​బాగ్, వెలుగు :  అన్నింటా వసతి సౌకర్యాలు కలిగిన హైదరాబాద్​ను దేశానికి రెండో రాజధానిగా ప్రకటించాలని  సినీ దర్శకుడు, తెలుగు సేన పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు సత్యారెడ్డి డిమాండ్ చేశారు.  బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ను రెండో రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈనెల12న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ఒకరోజు దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు. రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేస్తే...ఢిల్లీని పొల్యూషన్ నుంచి రక్షించుకోవచ్చునని పేర్కొన్నారు. దక్షిణాదిలోని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో  పార్టీ తెలంగాణలో 10 స్థానాల్లో, ఆంధ్రప్రదేశ్ లో 50 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలకు పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.