
కట్టప్పగా.. బాహుబలి మూవీతో ఇండియా లెవెల్లో ఫేమస్ అయినా యాక్టర్ సత్యరాజ్(Sathyaraj). లేటెస్ట్ గా అయన తమిళంలో వెపన్(Weapon) అనే మూవీలో యాక్ట్ చేస్తున్నారు. గుహన్ సెన్నియప్పన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో వసంత్ రవి, సత్యరాజ్ కీ రోల్స్ చేస్తున్న ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 68 ఏళ్ళ సత్యరాజ్.. 28 ఏళ్ల యంగ్ క్యారెక్టర్ చేయాల్సి ఉండగా.. దీంతో డైరెక్టర్ గుహన్( Guhan) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను (Artificial Intelligence) తీసుకొస్తున్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే ఎన్నోటెక్నాలజీలతో యంగ్ క్యారెక్టర్స్ గా చేయడం కొత్తేమీ కాదు. కానీ, ప్రెసెంట్ ట్రేండింగ్ లో ఉన్న AI టెక్నాలజీ సహకారంతో కొత్త ఫీల్ తీసుకురావడానికి డైరెక్టర్ ట్రై చేస్తున్నాడట. దీంతో ఈ సినిమా టాక్ ఆఫ్‌ది ఇండస్ట్రీగా మారింది. ఇటువంటి కొత్త ప్రయోగాలు ఎప్పుడు హాలీవుడ్ నుంచి రావడం అందరం చూసాము. కానీ ఇపుడు వస్తోన్న AI టెక్నాలజీ తో కొత్తగా న్యూస్ చదివే యాంకర్స్ కూడా వస్తుండటం విశేషం. అందుకే సోషల్ మీడియా లో వెపన్ మూవీ ఇంట్రెస్ట్ టాక్ గా నిలిచింది. ఇటువంటి టెక్నాలజీ తో మూవీ రావడం ఇదే ఫస్ట్ టైం అంటూ టాక్ వినిపిస్తోంది.
లేటెస్ట్ గా డైరెక్టర్ గుహన్..ఒక ఇంగ్లీష్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఈ మూవీలో సత్యరాజ్ రోల్ కోసం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నట్టు.. అందుకోసం 5 గురు క్రీయేటివ్ టీం వర్క్ చేస్తున్నట్టు తెలిపారు. కాగా యంగ్ సత్యరాజ్ ఏఐ ఫొటో బయటకురావడంతో నెటిజన్స్ నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తోన్నాయి.. ఇక నటీనటుల రూపురేఖలను కూడా ఈ టెక్నాలజీ మార్చేస్తుంది..అని ఒకరంటే.. ఇది పూర్తి స్థాయిలో డెవెలప్ అయితే వండర్స్ క్రీయేట్ అవ్వటం కన్ఫర్మ్.. అని మరొకరు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం ఇది ఫ్యూచర్ లో డేంజర్ అంటూ.. వారి ఫీలింగ్స్ ను తెలియజేస్తున్నారు.
మిషన్ ఇంపాజిబుల్, డెడ్ రికనింగ్ పార్ట్ వన్ లాంటి పెద్ద సినిమాల్లో ఏఐను ఉపయోగించారు. రాజీవ్ మీనన్ , రాజీవ్ పిళ్లై మరియు తాన్యా హోప్ తదితరులు నటించారు.ఈ మూవీకు జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.