OTT Court Drama: OTTలో ఉత్కంఠగా సాగే తమిళ కోర్ట్ రూమ్ డ్రామా.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Court Drama: OTTలో ఉత్కంఠగా సాగే తమిళ కోర్ట్ రూమ్ డ్రామా.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTTలోకి మొన్న శుక్రవారం (ఆగస్టు 1) తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో తెలుగు డబ్బింగ్ తమిళ కోర్ట్ రూమ్ డ్రామా ఇపుడీ ఓటీటీలో అదరగొడుతుంది. బాలాజీ సెల్వరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన 'సట్టముం నీతియుం' తమిళ వెబ్‌‌సిరీస్‌ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

ఇపుడీ ఈ మూవీ జీ5 లేటెస్ట్ మూవీస్ లిస్టులో ట్రెండింగ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో శరవణన్, నమ్రితా ఎంవీ, అరౌల్ డి శంకర్, షణ్ముఖం ప్రధాన పాత్రలు పోషించారు. ఉత్కంఠభరితమైన కోర్టు సన్నివేశాలతో పాటు భావోద్వేగంతో కూడిన కథాంశాలు ఉండటంతో ఆడియన్స్ ఎంగేజింగ్గా ఫీల్ అవుతున్నారు. కోర్టులో పేదవారికి న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ మూవీ ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. 

కథేంటంటే:

ఎలాంటి కేసులనైనా ఈజీగా గెలవగల కెపాసిటీ ఉన్న లాయర్‌‌‌‌ సుందరమూర్తి (శరవణన్). కానీ.. కేసులు వాదించకుండా కోర్టు బయట నోటరీ పబ్లిక్‌‌గా పనిచేస్తుంటాడు. చుట్టూ ఉన్నవాళ్లు, చివరికి కుటుంబ సభ్యులు కూడా అతన్ని ఒక ఫెయిల్యూర్ లాయర్‌‌‌‌గా చూస్తుంటారు. అయినా వాటన్నింటినీ మౌనంగా భరిస్తాడు. అప్పటికే సుందరమూర్తి టాలెంట్‌‌ గురించి తెలుసుకున్న అరుణ (నమృత) అతని దగ్గర జూనియర్‌‌గా చేరాలి అనుకుంటుంది.

అప్పుడే కుప్పుసామి (షణ్ముగం) అనే వ్యక్తి తనకు సరైన న్యాయం జరగలేదని కోర్టు ఆవరణలోనే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. అది చూసిన సుందరమూర్తి కుప్పుసామికి ఎలాగైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో ఏండ్ల తర్వాత మళ్లీ కేసు టేకప్‌‌ చేశాడు.

కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌‌) వేస్తాడు. అప్పుడే అరుణని కూడా జూనియర్‌‌గా చేర్చుకుంటాడు. సుందరమూర్తి ఈ కేసును ఎలా హ్యాండిల్ చేస్తాడు? కొన్నేళ్లపాటు అతను కేసులకు ఎందుకు దూరంగా ఉన్నాడు. కుప్పుసామి కథేంటి? తెలుసుకోవాలంటే ఈ వెబ్‌‌సిరీస్‌‌ చూడాలి.