సత్తువనిచ్చే 'సత్తు పానీయం'.. వేడిని తగ్గించే ఉపాయం

సత్తువనిచ్చే 'సత్తు పానీయం'.. వేడిని తగ్గించే ఉపాయం

దేశవ్యాప్తంగా ఎండలు భీబత్సం సృష్టిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమిని తట్టుకోలేక చాలా మంది పలు ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తున్నారు. బిహార్ లోని పాట్నాలోనూ 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు పెరగడంతో వేడిని అధిగమించడానికి ఈ ఎండాకాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలును చేసే తీపి, రుచికరమైన సత్తు పానీయాన్ని సేవిస్తున్నారు. దీంతో ఈ పానియానికి భారీ డిమాండ్‌ ఏర్పడింది.

వేడిగా వాతావరణంలో శరీరాన్ని చల్లబరిచే, చలువ చేసే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి నీటికి ప్రత్యామ్నాయాలు చాలా ఉపయోగపడతాయి. అందులో ముఖ్యంగా శరీరాన్ని చల్లబరిచే అనేక పానీయాలు ఉన్నప్పటికీ సత్తు పానీయం ఈ సమ్మర్ లో హెల్తీ డ్రింక్ గా ఉపయోగపడుతుంది. సాధారణంగా దీన్ని బెంగాల్ పప్పును వేయించి తయారు చేస్తారు.

సత్తు పానీయాన్ని ఎలా తయారు చేస్తారంటే?

బెంగాల్ గ్రాము లేదా చనే కి దాల్‌ను ఇసుకలో వేయించి సత్తు తయారు చేస్తారు. సత్తులో ఐరన్, సోడియం, ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీన్ని నీళ్లలో కలిపి, చిటికెడు ఉప్పు, నిమ్మరసం పిండి ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఇది కడుపు సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.