జ్యోతిష్యం: రేవతి నక్షత్రంలోకి శని.. 2027 వరకు ఎలా ఉండబోతుంది..

జ్యోతిష్యం:  రేవతి నక్షత్రంలోకి శని.. 2027 వరకు  ఎలా ఉండబోతుంది..

శని భగవానుడు.. శని గ్రహం.. అంటే జనాలు భయపడతారు.  జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు కర్మఫలదాతగా.. న్యాయాధిపతిగా ఉంటారని పండితులు చెబుతున్నారు.  ఈ కారణంగానే గ్రహాల అన్నింటిలోకి శని దేవుని కదలికకు జ్యోతిష్య నిపుణులు  అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.30 ఏళ్ల తరువాత  శని గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశించాడు.దీని ప్రభావం 2027 వరకు ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

శని భావోద్వేగాలను కలుగజేస్తాడు.  ఆత్మ పరిశీలన.. వ్యక్తిగత ఎదుగుదల.. ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తాడని పండితులు చెబుతున్నారు.  శని దృష్టి సరిగా లేకుంటే కొన్ని సవాళ్లను ఎదుర్కొవలసి ఉంటుంది.  
శని రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం వలన  రాబోయే రెండు సంవత్సరాలు  ప్రపంచ వ్యాప్తంగా కొన్ని అనుకోని పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.  దారి తప్పిన ఆత్మలను కష్టమైన కర్మ మార్గంలో ప్రయాణించే విధంగా చేస్తాడు.  కొన్ని కారణాల వలన  వ్యక్తులకు వివాహ సమస్యలు ఎక్కవ​అవుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. భావోద్వేగం, అపరిపక్వత, కర్మ రుణాలు, తప్పుడు భాగస్వామి ఎంపికలు, అవాస్తవిక అంచనాలు, కుటుంబ కర్మలు, మానసిక అస్థిరతలు  కారణంగా కలిగే అవకాశం ఉంది.  దీంతో జనాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. 

శని రేవతి నక్షత్రంలో సంచరించడం వలన యువకులు ఆవేశ పూరితంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.  2026 నుంచి  2029 మధ్యలో  కొత్త దంపతుల విషయంలో ఆకస్మిక మార్పులు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది వారి వ్యక్తిగత జాతకాలపై ఆధారపడి ఉంటుంది.  1996 నుండి 1998 మధ్య జన్మించిన వారికి కూడా ఇదే వర్తిస్తుంది. 

శని గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల, వివాహం కోసం ఎదురుచూస్తున్న చాలా మందికి పెళ్లి జరిగే అవకాశం ఉంది .  ఈ గోచారం వల్ల  కన్యా రాశి  జాతకులు ఎక్కువగా ప్రభావితమవుతారని పండితులు చెబుతున్నారు. వ్యాపారం.. ఉద్యోగం, వివాహం,  దీర్ఘకాలిక ఒప్పందాల విషయంలో ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.