సత్వా గ్రూప్తో నియోపోలిస్ జంక్షన్ల బ్యూటిఫికేషన్

సత్వా గ్రూప్తో నియోపోలిస్ జంక్షన్ల బ్యూటిఫికేషన్
  • సీఎస్ఆర్​ నిధులతో పనులు చేయడానికి ముందుకొచ్చిన సంస్థ

హైదరాబాద్​సిటీ, వెలుగు: కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్​లో తమ సొంత నిధులతో జంక్షన్ల బ్యూటిఫికేషన్ చేపట్టడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ ముందుకొచ్చింది. హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్​లో తమ సీఎస్ఆర్ నిధులతో పనులు చేస్తామని ఆ సంస్థ ప్రతిపాదనలు సమర్పించగా, అనుమతించినట్లు మెట్రోపాలిటన్​కమిషనర్​సర్ఫ్​రాజ్​అహ్మద్​తెలిపారు. దీంతో నియోపోలిస్ సెజ్ వద్ద రోటరీ జంక్షన్, మోకిలా రోడ్డులోని రెండు ట్రయాంగిల్ జంక్షన్లలో ల్యాండ్ స్కేపింగ్, బ్యూటిఫికేషన్ పనులను సత్వా గ్రూప్ నిర్వహించనుంది. 

దీనికయ్యే ఖర్చంతా సత్వాగ్రూపే భరిస్తుందని, బ్యూటిఫికేషన్​తో పాటు ఐదేండ్ల మెయింటెనెన్స్​చేసేలా ఆ సంస్థ హెచ్ఎండీఏతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ జంక్షన్లను హెచ్‌‌‌‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం కొంతమేరకు తీర్చిదిద్దగా, సత్వా గ్రూప్ ఇప్పుడు హైదరాబాద్ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే శిల్పాలు, అందమైన నిర్మాణాలతో భారీగా అభివృద్ధి చేయనుంది.