సత్య లీడ్ రోల్‌లో రితేష్ రానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘జెట్లీ’ (JETLEE). ఈ సినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్‌గా పరిచయమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గురువారం ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కాలభైరవ కంపోజ్ చేసిన ఈ పాటకు సాయి సోమయాజులు లిరిక్స్ అందించగా, శ్రావణ భార్గవి పాడింది.
‘ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ హిస్టరీ, అంతుచిక్కడు ఈజీలీ, ఒకటిమాత్రం తెలుసు మరీ.. ఈజ్ నాట్ జెట్లీ.. తొవ్వి తీసినా హిస్టరీ, రాదు మనకు క్లారిటీ..’ అంటూ సాగిన పాటలో సత్య స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ఫన్నీ మూవ్స్‌తో ఆకట్టుకున్నాడు. విజయ్ పొలాకి కొరియోగ్రఫీలో హీరోయిన్ రియా సింఘాతో తను చేసిన స్టెప్స్ ఇంప్రెస్ చేశాయి.
