లింక్డ్ఇన్లో మొత్తం మనోళ్లే.. రికార్డ్ సృష్టించిన ఇండియన్స్

లింక్డ్ఇన్లో మొత్తం మనోళ్లే.. రికార్డ్ సృష్టించిన ఇండియన్స్

లింక్డ్ ఇన్.. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇప్పుడంతా ఇదే. జాబ్ కావాలన్నా, నేర్చుకోవాలన్నా, ఉద్యోగావకాశాలు కల్పించాలన్నా చాలామంది చూస్తున్న సైట్ ఇది. తక్కువ టైంలోనే ప్రొఫెషనల్ సోషల్ నెట్వర్కింగ్ కనెక్ట్ సైట్ ఎదిగింది లింక్డ్ ఇన్. అయితే, ఇందులో కూడా భారతీయులు రికార్డు నెలకొల్పారు. ఈ విషయాన్ని స్వయంగా మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల తెలియజేశాడు.

లింక్డ్ ఇన్ లో ప్రపంచ వ్యాప్తంగా 930 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. అందులో భారత్ నుంచి 100 మిలియన్ల మంది లింక్డ్ ఇన్ యూజర్లు ఉన్నారు. ప్రతీ ఏటా భారత్ నుంచి లింక్డ్ ఇన్ జాబితాలో చేరుతున్న వారి సంఖ్య 19 శాతానికి పెరుగుతుందని సత్య నాదెళ్ల తెలిపారు. దీంతో లింక్డ్ ఇన్ వార్షిక ఆదాయం 8శాతం పెరిగింది.