వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వరుసగా విభిన్న కథలు, పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్, తన కెరీర్‌లో 16వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం SD16గా పిలుస్తున్న ఈ చిత్రానికి ‘సమవర్తి’ (SAMAVARTHI) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
“ఒక ఉత్కంఠభరితమైన, ఉగ్ర ప్రయాణం ఈ ‘సమవర్తి’” అంటూ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచారు. పోస్టర్‌ను బట్టి చూస్తే ఇది పూర్తి స్థాయి అడ్రినలిన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సత్యదేవ్‌ను ఈసారి ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూపించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
#SD16 is #Samavarthi - ONE HELL OF A WILD RIDE 🔥
— Rudra_pictures (@Rudra_Pictures) May 22, 2026
Presenting @ActorSatyaDev, in ADRENALINE ACTION MODE❤️🔥🪓
An Ecological Action Thriller !
Written & Directed by @AjayNagV 🎬
Produced by @JakkidiShivaIYC @Shashidhar1909@Rudra_Pictures @PanchabhutaOffl pic.twitter.com/EtKhhaJO0n
ఈ చిత్రాన్ని రచయిత-దర్శకుడు అజయ్ నాగ్ V తెరకెక్కిస్తున్నారు. ఎన్విరాన్‌మెంటల్ బ్యాక్డ్రాప్లో ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌లో మూవీ రూపొందుతుంది. ఇందులో యాక్షన్‌తో పాటు స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉండనున్నట్లు సమాచారం.
ప్రస్తుత సమాజంలో ఇష్టం వచ్చినట్లుగా చెట్లను నరకడం, మూగ జీవాలకు నీళ్లు, తిండి, గూడు లేకుండా చేయడం వంటి అంశాలపై మూవీ రానుంది. టైటిల్ పోస్టర్‌తోనే ఫుల్ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దీంతో ‘సమవర్తి’పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇకపోతే, ‘సమవర్తి’ అంటే యముడు (ధర్మరాజు) అని అర్ధం. ఇంకా చెప్పాలంటే అందరి పట్ల పక్షపాతం లేకుండా సమానంగా వ్యవహరించే వ్యక్తిని సమవర్తి అంటారు.
Every forest has a silence,
— Rudra_pictures (@Rudra_Pictures) May 21, 2026
that hides a STORM 🔥#SD16 - TITLE & FIRST LOOK,
TOMORROW @11:07 AM 📣@ActorSatyadev in
A WILD ACTION ADVENTURE!
Written and Directed by @AjaynagV76733 🎬@JakkidiShivaIYC #ShashidharReddyPadamati @SinjithYerramil #VinayReddyMamidi pic.twitter.com/67ONcrjNk7
