విజయ్‌‌‌‌‌‌‌‌ దేవరకొండను నిజంగానే బ్రదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా ఫీలయ్యా: సత్యదేవ్

విజయ్‌‌‌‌‌‌‌‌ దేవరకొండను నిజంగానే  బ్రదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా ఫీలయ్యా: సత్యదేవ్

ఓ వైపు లీడ్ రోల్స్ చేస్తూనే, మరోవైపు స్టార్ హీరోల చిత్రాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌తో మెప్పిస్తున్నాడు సత్యదేవ్. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా విడుదలైన ‘కింగ్డమ్’ సినిమాలో విజయ్ దేవరకొండకు అన్నయ్యగా కనిపించాడు. ఈ చిత్రంలో తన పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా సత్యదేవ్ చెప్పిన విశేషాలు. 

“ఈ కథను దర్శకుడు  గౌతమ్ చెప్పినప్పుడే కనెక్ట్ అయ్యాను. శివ పాత్రను బాగా డిజైన్ చేశాడు. నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తోన్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇస్తోంది.  ‘బ్లఫ్ మాస్టర్’తో నాకు పేరు వచ్చింది. కానీ, అది ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి సమయం పట్టింది. ‘కింగ్డమ్‌‌‌‌‌‌‌‌’కు మాత్రం  విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్, భారీతనం వల్ల తక్కువ సమయంలోనే  ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. ఇందులోని బ్రదర్స్ ఎమోషన్‌‌‌‌‌‌‌‌కు ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ బాగా కనెక్ట్ అవుతున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌లతో పాటు బలమైన ఎమోషన్ సినిమాకు ప్లస్ అయ్యింది. విజయ్‌‌‌‌‌‌‌‌ని నేను నిజంగానే ఒక బ్రదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా ఫీల్ అయ్యాను. ఆయన   సన్నివేశాన్ని కానీ, సంభాషణలను కానీ అర్థం చేసుకొని నటించే తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. 

గౌతమ్ విజన్ ఉన్న డైరెక్టర్. ఆయన టేకింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. అలాగే   నాగవంశీ గారు గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. కథను నమ్మి సినిమా చేద్దాం అనుకున్నారంటే.. ఎక్కడా వెనకడుగు వేయరు. ఇక  ‘గాడ్ ఫాదర్’ తర్వాత అటువంటి అవకాశాలు వచ్చినా చేయలేదు. సుమారు 10, 15 సినిమాలు వదిలేసుకున్నా. నేను డబ్బు కోసం సినిమాలు చేయడం లేదు. ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వాలని, నా పాత్రకు మంచి పేరు రావాలని చేస్తున్నా. డబ్బు కోసం అయితే వ్యవసాయం చేసుకుంటా. ఇక నేను నటించిన  ‘అరేబియన్ కడలి’  సిరీస్  అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ఫుల్ బాటిల్’  సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. వెంకటేష్ మహా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. 'ఆరంభం' ఫేమ్ అజయ్‌‌‌‌‌‌‌‌ నాగ్‌‌‌‌‌‌‌‌తోనూ ఓ చిత్రం చేస్తున్నా. వీటితో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి’’.