
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. రైతులు సత్యాగ్రహం ద్వారా కేంద్ర ప్రభుత్వ అహంకారాన్ని ఓడించారని రాహుల్ అన్నారు. ‘దేశ రైతులు సత్యాగ్రహంతో అహంకారం మెడలు వంచారు. అన్యాయంపై సాధించిన ఈ విజయానికి అన్నదాతలకు శుభాకాంక్షలు. జై హింద్, జై హింద్ కా కిసాన్’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
देश के अन्नदाता ने सत्याग्रह से अहंकार का सर झुका दिया।
— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2021
अन्याय के खिलाफ़ ये जीत मुबारक हो!
जय हिंद, जय हिंद का किसान!#FarmersProtest https://t.co/enrWm6f3Sq