నరాలు కట్ అయ్యేలా.. పొలిమేర2 కొత్త ట్రైలర్

నరాలు కట్ అయ్యేలా.. పొలిమేర2 కొత్త ట్రైలర్

మా ఊరి పొలిమేర (Maa oori Polimera).. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజై భారీ విజయాన్ని అందుకున్న సినిమా. సత్యం రాజేష్ (Sathyam rajesh), బాలాదిత్య (Baladithya), గెటప్ శ్రీను (Getup srinu) ప్రధాన పాత్రలో అనిల్ విశ్వనాథ్ (Anil Vishwanath) తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ వెన్నులో వణుకుపుట్టించింది. చేతబడి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులకైతే ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది.

ఇక రీసెంట్గా రిలీజ్ చేసిన మా ఊరి పొలిమేర2 ట్రైలర్ చాలా గ్రిప్పింగ్గా, ఇంట్రెస్టింగ్ ఉంది. ఇందులో కూడా మొదటి పార్ట్ లాగే చేతబడి కాన్సెప్ట్ ను మరింత పెంచినట్టు రివీల్ చేశాడు డైరెక్టర్. ఈ మూవీ నవంబర్ 3న రిలీజ్ అవుతుండటంతో మేకర్స్ రీ రీలిజ్ ట్రైలర్ కూడా విడుదల చేశారు.

రీ రీలిజ్ ట్రైలర్ విషయానికి వస్తే.. 

సత్యం రాజేష్ ను వెతుక్కుంటూ వెళ్లిన..గెటప్ శ్రీనుతో..ఊర్లో అందరూ మంచిగా ఉన్నారా? అంటూ సత్యం రాజేష్ మాట్లాడే ఇంటెన్స్ డైలాగ్తో మొదలవుతూనే వణుకు పుట్టిస్తోంది. ఊరి పొలిమేరలో ఉన్న గుడిలోని మిస్టరీ..మహబూబ్‌నగర్లో జరిగిన దారుణ హత్యలకు, చేతబడులకు మధ్య ఉన్న లింక్తో ట్రైలర్ ఆసక్తి రేపుతోంది.

ఇక ట్రైలర్లో ఇన్వెస్టిగేట్ పోలీస్ అధికారి విలువైన సమాచారాన్ని కనుక్కోవడానికి బయలుదేరగా..అతని వెంటే ఓ ఆర్కియాలజిస్ట్ కూడా వెళ్తాడు. ఆ గ్రామంలోని ఆలయ మిస్టరీని ఛేదించడమే లక్ష్యంగా వీళ్లు పని చేస్తుండటంతో..ముఖ్య విషయాలు బయట పెట్టడం వంటి సీన్స్ చూపించారు. ఏమన్నా ట్విస్టులిచ్చిన భయ్యా..బంచత్..దెబ్బ మీద దెబ్బ..నరాలు కట్ అయ్యేలా.. ఉంది అంటూ ట్రైలర్ తో ఆసక్తి రెట్టింపు చేశారు. 

ALSO READ :- పాలేరు నుంచే షర్మిల పోటీ

ఇక పొలిమేర2 నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమాలో కూడా సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. గెటప్ శ్రీను, రాకేందు మౌళి, రవి శంకర్ ఇలా చాలా మదిని ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి పొలిమేర 2 కూడా ఫస్ట్ పార్ట్ లాగ మంచి విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి.