పాలేరు నుంచే షర్మిల పోటీ

పాలేరు నుంచే షర్మిల పోటీ

ఎన్నికల టైమ్ దగ్గర పడుతుండటంతో వైఎస్ఆర్టీపీ దూకుడు పెంచేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల..  2023 నవంబర్ 06న  పాలేరులో నామినేషన్  వేయనున్నారు.  అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 50 సభలకు వైఎస్ఆర్టీపీ సన్నాహాలు చేస్తోంది.  ఈ మేరకు ఆ పార్టీ  అధికారికంగా వెల్లడించింది.  నవంబర్ 1వ తేదీ నుండి  నియోజకవర్గంలో  షర్మిల ప్రచారం నిర్వహించనున్నారు. 

మరోవైపు  రాష్ట్రంలో ఎన్నికలు నామినేషన్లు దగ్గర పడుతున్నాయి.  నవంబర్ 3 నుంచి నామినేషన్ల ధరఖాస్తులును స్వీకరించనున్నారు.  అయితే ఇప్పటివరకు  వైఎస్ఆర్టీపీ ఒక్క లిస్టును కూడా ప్రకటించలేదు.  119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పిన  షర్మిల..  ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించకపోవడం ఆ పార్టీ కార్యకర్తల్లో పలు అనుమానాలకు రేకేత్తిస్తుంది.  

పాలేరులో ఈ సారి టఫ్ ఫైట్ కనిపించబోతుంది.  బీఆర్‌ఎస్ తరపున కందాల ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్టీపీ నుంచి షర్మిల పోటీలో ఉండటంతో  పాలేరు పోరు రసవత్తరంగా మారనుంది.  కామారెడ్డి, గజ్వేల్ తరువాత పాలేరు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కలిగించే నియోజకవర్గంగా మారనుంది.